ఆలయంలో హుండీకి క్యూఆర్ కోడ్ పెట్టి రూ.3.5 లక్షలు నొక్కేశాడు

64చూసినవారు
ఆలయంలో హుండీకి క్యూఆర్ కోడ్ పెట్టి రూ.3.5 లక్షలు నొక్కేశాడు
సరికొత్త ఎత్తుగడతో ఓ మోసగాడు దేవుడి గుడికి వచ్చే భక్తులను బురిడీ కొట్టించాడు. చైనాలోని ఓ బౌద్ధ ఆలయంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి గుడిలోని హుండీకి తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ అతికించాడు. భక్తులు దానిని స్కాన్ చేసి విరాళాలు సమర్పించుకునే వారు. ఇలా ఆ మోసగాడి ఖాతాలో రూ.3.5 లక్షలు చేరాయి. చివరికి షాంగ్సీ పోలీసులు విచారణ చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేశారు. దోచుకున్న డబ్బును వసూల్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్