AP: సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు కీలక సూచన చేశారు. ప్రతినెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్రలో భాగంగా ఈ మేరకు ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులు కూడా ప్రతి మూడో శనివారం శుభ్రతపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మెచ్చుకునేలా యోగా నిర్వహించబోతున్నట్లు చెప్పారు.