తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

54చూసినవారు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
వేసవి సెలవులు కావడంతో శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. శిలాతోరణం వరకు క్యూ కొనసాగుతోంది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలను తనిఖీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 63,208 మంది భక్తులు దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్