చంద్రబాబు పాలనపై పెరిగిన నమ్మకం: "తల్లికి వందనమే" సాక్ష్యం!

73చూసినవారు
చంద్రబాబు పాలనపై పెరిగిన నమ్మకం: "తల్లికి వందనమే" సాక్ష్యం!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఉన్న చిత్తశుద్ధికి "తల్లికి వందనం" పథకం ఒక నిదర్శనంగా నిలుస్తోంది. ఆర్థికంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చంద్రబాబు నాయకత్వ సామర్థ్యాన్ని, విశ్వసనీయతను మరింత పెంచిందని ప్రజలు భావిస్తున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం రావడం పట్ల ఒక ధైర్యం వచ్చిందని ప్రజలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం గొప్ప విషయమని ప్రజలు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్