భారతదేశంలో రెండు శతాబ్ధాల పాటు.. బ్రిటిష్ పాలన కొనసాగింది. ప్రజలను హింసిస్తూ జాతి అహంకారంతో బ్రిటిష్ వాళ్లు పాలన చేశారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో అది స్వాతంత్య్ర పోరాటానికి దారి తీసింది. 1857 తిరుగుబాటుతో ఈ పోరాటం తీవ్రరూపం దాల్చింది. 1920లో మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ తిరుగుబాటు ఊపందుకుంది. అనంతరం భారత స్వాతంత్య్ర బిల్లును బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ జూలై 4, 1947న ప్రవేశపెట్టడంతో.. అంతిమంగా ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టింది.