భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. పహల్‌గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా.. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ 15 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించింది. డమ్మీ జెట్లతో పాక్‌ను ఏమార్చి దెబ్బ తీసింది. ఈ క్రియాత్మక సంఘర్షణలో బ్రహ్మోస్ క్షిపణులను వినియోగించడం ఇదే తొలిసారి అని నిపుణులు పేర్కొన్నారు.