ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అంతర్జాతీయంగా పాక్ ఉగ్ర మద్దతును ఎత్తిచూపేందుకు భారత్ దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. పాక్ కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (BJP), బైజయంత్ పాండా (BJP), సంజయ్ కుమార్ ఝా (JDU), కనిమొళి (DMK), సుప్రియా సూలే (NCP), శ్రీకాంత్ శిందే (శివసేన) సభ్యులుగా ఎంపికయ్యారు.