భారత్ అభివృద్ధిని ప్రపంచదేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీవల దావోస్ పర్యటనలోనూ దీన్ని గమనించానని చెప్పారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని చెప్పారు. ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మార్మోగుతోందన్నారు. ‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుంది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి’ అని చంద్రబాబు అన్నారు.