సిడ్నీ టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనుకున్నట్లుగానే రోహిత్ శర్మ తుది జట్టులో లేరు. శర్మకు బదులుగా బుమ్రా టాస్‌కు వచ్చారు. రోహిత్ స్వచ్ఛందంగా విశ్రాంతి తీసుకున్నట్లు బుమ్రా తెలిపారు. జట్టులో రోహిత్ స్థానంలో గిల్, ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకున్నారు. భారత్ బ్యాటర్లు జైస్వాల్, రాహుల్ ఔట్ కాగా, క్రీజులో గిల్ 9, కోహ్లీ 8 ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 12 ఓవర్లకు 32/2.