మౌంట్ ఎవరెస్ట్ వద్ద ఓ భారతీయుడు మృతి చెందాడు. మృతుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుబ్రతా ఘోష్‌గా అధికారులు గుర్తించారు. సుబ్రాత్ ఘోష్(45) తన గైడ్ చంపల్ తమంగ్‌తో కలిసి ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అనారోగ్య సమస్యలు కారణంగా హిల్లర్ స్టెప్ వద్ద నుంచి కిందకు రాలేకపోయాడు. ఈక్రమంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి గైడ్ కిందకు చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు.