దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. కెనడా, మెక్సికో దేశాలపై విధించిన టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో పాజిటివ్ సెంటిమెంట్‌కు కారణమైంది. దీంతో మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 23,600 పాయింట్ల మార్కును దాటింది.