దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ముగిశాయి. నిన్న భారీ లాభాల్లో ముగిసిన సూచీలు నేడు నష్టాల బాట పట్టాయి. అమెరికా- చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో షేర్ హోల్డర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సెన్సెక్స్ 312.53 పాయింట్ల నష్టంతో 78,271.28 వద్ద ముగియగా నిఫ్టీ 42.95 పాయింట్ల నష్టంతో 23,696.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 87.46గా ఉంది.