AP: తొలి ఏకాదశి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. క్యూలన్నీ కిక్కిరిసి ఉండగా, లిఫ్ట్ మార్గం, ఘాట్ రోడ్డు వైపు ప్రాంతాలు భక్తుల రద్దీతో జనసంద్రంగా మారాయి. క్యూలైన్లలో ఉన్న భక్తులు త్వరగా ముందుకు కదిలేలా ఏఈవోలు చర్యలు తీసుకున్నారు. రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలపై అధికారులు ఆంక్షలు విధించారు.