అమెరికాలో స్థిరపడిన భారత ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ నీహర్ సచ్‌దేవా గుండుతోనే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘అలోపేసియా’ వ్యాధి కారణంగా నీహర్ చిన్న వయసు నుంచి జుట్టు కోల్పోయింది. కొత్తగా జుట్టు వచ్చినా అదీ రాలిపోతోంది. కొన్నాళ్లుగా విగ్గుతో విసుగుపోయిన ఆమె గుండు గీయించుకుంటోంది. హిందూ సంప్రదాయం ప్రకారం తన చిరకాల మిత్రుడిని వివాహం చేసుకుంది.