వచ్చే నెల నుంచి ఇంటర్నేషనల్ మద్యం బ్రాండ్లు అందుబాటులోకి వస్తాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 15 రోజుల్లో కల్లుగీత కార్మికులకు 340 షాపులు కేటాయిస్తామన్నారు. సిండికేట్ లేకుండా చూస్తామన్నారు. మద్యం దుకాణాదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ అమ్మినా, ట్యాక్స్ చెల్లించని మద్యం విక్రయించినా జరిమానాలు విధిస్తామని, లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.