AP: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి. జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. 1:2 నిష్పత్తిలో సుమారు 182 మందికి రెండు బోర్డుల ద్వారా ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్వ్యూకు హాజరయ్యే రోజునే ఏపీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. స్పోర్ట్స్ కేటగిరీలో 42 మంది అభ్యర్థులకు ఈ నెల 17న సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.