AP: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా టీటీడీలో జరిగిన అంశాలపై దర్యాప్తు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని పలువురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసింది. త్వరలో టీటీడీలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులను అరెస్టు చేసే అవకాశం ఉంది. సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారులలో ఆందోళన మొదలైంది.