AP: రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు దర్యాప్తు ముమ్మరం చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందడంతో జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కొన్ని పంచాయతీల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బిల్లుల చెల్లింపులు చేసినట్లు నిర్ధారించి, వీటిపై సమగ్ర పరిశీలన చేపట్టాలని తెలిపారు.