AP: అనంతపురంలో బాలికపై అత్యాచారం, ఇంటర్ విద్యార్థిని హత్య ఘటనలు బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినందుకే ఇంటర్ విద్యార్థినిని నిందితుడు హత్య చేశాడని ఆమె చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. నిర్లక్ష్యంగా ఉన్న సీఐని ప్రభుత్వం సస్పెండ్ చేసిందని తెలిపారు. విద్యార్థిని హత్య కేసుపై విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు.