AP: ఇంధన, పర్యాటక, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రూ.33,720 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ దిగ్గజ సంస్థలు ముందుకొచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. 19 ప్రాజెక్టుల ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 34,621 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఏటీసీ టైర్స్, వింగ్‌టెక్ మొబైల్స్, డైకిన్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు వివిధ సంస్థల నుంచి అందిన పెట్టుబడుల ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.