జగన్‌ను బెంగళూరులో కలిసిన ఐపీఎస్‌లు : వర్ల రామయ్య

52చూసినవారు
జగన్‌ను బెంగళూరులో కలిసిన ఐపీఎస్‌లు : వర్ల రామయ్య
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను వీఆర్‌లో ఉన్న 16 మంది ఐపీఎస్‌లు బెంగళూరులో కలిశారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సంచలన ఆరోపణలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారం కోల్పోయిన జగన్‌ను కలవలేదని ఆ ఐపీఎస్‌లు చెప్పగలరా అని ప్రశ్నించారు. సీనియర్లను కాదని రాజేంద్రనాథ్ రెడ్డిని DGPగా నియమించినప్పుడు లేవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయని నిలదీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్