సెప్టెంబర్‌ నాటికి టీడీఆర్‌ బాండ్ల అక్రమాలు తేలుస్తాం: మంత్రి నారాయణ

78చూసినవారు
సెప్టెంబర్‌ నాటికి టీడీఆర్‌ బాండ్ల అక్రమాలు తేలుస్తాం: మంత్రి నారాయణ
టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీ వేశామని, సెప్టెంబర్‌ చివరి నాటికి అక్రమాలు తేలుస్తామని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీఆర్‌ బాండ్లలో రూ.వేల కోట్లు పక్కదారి పట్టాయన్నారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ‘‘వైసీపీ పాలనలో నగరపాలక సంస్థల్లో ఉద్యోగులను నియమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. మున్సిపల్‌ శాఖలోని సమస్యలను 6 నెలల్లో పరిష్కరిస్తాం’’అని నారాయణ తెలిపారు.

సంబంధిత పోస్ట్