AP: జూన్ 12న 'తల్లికి వందనం' పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో రూ. 15,000 జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆరేళ్లు దాటి చదువుకునే ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తించనుంది. కానీ ఈ ఏడాది వేలాది మంది విద్యార్థులు ఐదేళ్లు పూర్తి చేసుకుని ఆరో ఏట అడుగుపెట్టనున్నారు. వారు ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లలో చేరనున్నారు. అయితే ఈ లోపే ప్రభుత్వం నిధులు విడుదల చేయనుండటంతో వారికి అందడం అనుమానంగా మారింది.