1982లో టీడీపీ పార్టీని ఎన్టీఆర్ స్థాపించినప్పుడు పాతికేళ్ల వయస్సులో ఉన్న వారు ఎంతో మంది పార్టీలో చేరి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా సేవలందించారు. అప్పట్లో అన్న గారు యువకులను పిలిచి టికెట్లు ఇచ్చి పార్టీలో కీలక నేతలను చేశారు. మరో అర్థ శతాబ్ధం పాటు టీడీపీ ఇదే విధంగా ముందుకు సాగాలంటే యువకులకే ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. దీంతో సీనియర్లకు రెస్ట్ తప్పదని రాజకీయ నిపుణులు అంటున్నారు.