భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన అద్భుతమైన అంతరిక్ష ప్రయోగాలతో ఎప్పటిలాగే దేశాన్ని గర్వపడేలా చేస్తోంది. ఇస్రో 2025 మే 18న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ ద్వారా EOS-09 (రీశాట్-1బీ) శాటిలైట్‌ను ప్రయోగించనుంది. ఈ శాటిలైట్‌ను రీశాట్-1బీ (RISAT-1B) అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశ అంతరిక్ష సాంకేతికతలో మరో మైలురాయి. ఈ 1,710 కిలోల శాటిలైట్ 529 కిమీ ఎత్తులో సూర్య సమకాలిక కక్ష్యలో ఉంటుంది.