జగన్ మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశే: లోకేష్

67చూసినవారు
జగన్ మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశే: లోకేష్
AP: సొంత చెల్లి పుట్టుకపై దుష్ప్రచారం చేయించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహిళలను గౌరవిస్తారని ఆశించడం అత్యాశేనని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. "జగన్ మొన్న తెనాలి గంజాయి బ్యాచ్ రౌడీషీటర్లకు ఓదార్పు యాత్ర చేశారు. ఇప్పుడేమో తల్లిలా గౌరవించాల్సిన మహిళలను వేశ్యలని కూసిన వారికి మద్దతుగా నిలుస్తున్నారు. సొంత తల్లిని, చెల్లిని మెడ పట్టి బయటకు గెంటేసి.. కోర్టుకు ఈడ్చారు." అని లోకేష్ బుధవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్