AP: వైసీపీ అధినేత జగన్ 2.0 అంటూ కొత్త నాటకానికి తెరలేపారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. 'జగన్ అంటున్నట్లు అది 2.0 కాదు.. పాయింట్ 5. ఆయన కాళ్ల కింద వ్యవస్థలు నలిగిపోయాయి. ఐదేళ్లలో కార్యకర్తలను పట్టించుకోని జగన్ ఇప్పుడు వారి గురించి మాట్లాడటం వింతగా ఉంది. జగన్ ఎన్నో ప్యాలెస్లు కట్టించుకున్నారు. TDP సంగతి తర్వాత చూద్దువు.. ముందు మీ పార్టీ సంగతి చూడండి' అని సోమిరెడ్డి హితవు పలికారు.