ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఎందుకంటే.. ఉల్లిలో పొటాషియం, పీచు, మాంగనీసు, విటమిన్ సి, బి1, బి6 పుష్కలంగా ఉంటాయి. ఉల్లిలో 25 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఉల్లి రసం తీసుకుంటే ఊబకాయుల్లో రక్తపోటు తగ్గుతుంది. కణ స్థాయిలో జరిగే వాపు ప్రక్రియ అదుపులో ఉండేలా చేస్తుంది. ఎర్ర ఉల్లిగడ్డలో యాంతోసయానిన్లు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.