కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ తీరు చర్చనీయాంశంగా మారింది. ఆదివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద డాక్టర్‌ను బూతులు తిడుతూ ఎమ్మెల్యే దుర్భాషలాడారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో తన తప్పును తెలుసుకుని డాక్టర్‌కు క్షమాపణ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. దీనికి పరిహారంగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన ఇంటి వద్ద ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నట్లు నానాజీ ప్రకటించారు.