అదంతా అబద్ధం.. ఎవరూ నమ్మొద్దు: క‌లెక్ట‌ర్‌

72చూసినవారు
అదంతా అబద్ధం.. ఎవరూ నమ్మొద్దు: క‌లెక్ట‌ర్‌
విజయవాడ, పరిసర గ్రామాల ప్రజల వెణ్ణులో వణుకు పుట్టించిన బుడమేరుపై ఓ దుష్ప్రచారం బాగా వైరల్ అవుతోంది. బుడమేరుకు మళ్లీ వరద అంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. సృజన స్పందించారు. బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవన్నారు. బుడమేరుకు మళ్లీ వరద వస్తే సమాచారం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్