సూపర్ సిక్స్‌తో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన ప్రకటనలు నిజమయ్యేలా కనిపించడం లేదు. వైసీపీ పాలనలో సంక్షేమ పథకాల అమలు పేరుతో లూఠి జరిగిందని ఆరోపించిన చంద్రబాబు పథకాలకు డబ్బులు లేవని చెప్పడమే అందుకు కారణం. ఇదే టైమ్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయలేమంటూ పరోక్షంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ ఏడాది సూపర్ సిక్స్ అమలు జరిగేలా కనిపించటంలేదు.