బెంగళూరు ప్యాలెస్‌లో ఎంజాయ్ చేస్తున్న నీకు ఏపీలో ఏం జరుగుతుందో తెలుసా వైఎస్ జగన్ అంటూ టీడీపీ మండిపడింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా టీడీపీ ఓ పోస్టర్‌ను పంచుకుంది. పోస్టర్‌తో పాటు ‘‘అధికారంలో ఉన్న ఐదేళ్ళలో ఏపీలో రాష్ట్ర విద్యార్థుల కష్టాలు పట్టించుకోకుండా రూ.4,271 కోట్ల ఫీజు బకాయిలు పెట్టిన జగన్ రెడ్డి.. ఇప్పుడు బెంగళూరు నుంచి వచ్చి రాజకీయాలు చేస్తాడంట. విద్యార్థులను ఏ అర్హతతో పోరుకు పిలుస్తున్నావు జగన్ రెడ్డీ?’’ అంటూ టీడీపీ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చింది.