AP: ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారయ్యారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తూ వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా వైసీపీ నేతల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈనెల 30న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.