జగన్ తన సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేయలేదు: మంత్రి సవిత

80చూసినవారు
జగన్ తన సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేయలేదు: మంత్రి సవిత
AP: టీడీపీ మంత్రి సవిత కడప జిల్లాలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్ల పాలనలో మాజీ సీఎం జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. " జగన్ తీరుతో రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేకపోయిందని మంత్రి ధ్వజమెత్తారు. తన సొంత జిల్లాను సైతం అభివృద్ధి చేయలేదని, ఇలాంటి వ్యక్తి ఎక్కడా ఉండరని మండిపడ్డారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని" ఆమె హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్