AP: వైసీపీ అధినేత జగన్.. కూటమి ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేయిస్తున్నారని హోం మంత్రి అనిత మండిపడ్డారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'జగన్ ఎప్పుడూ మహిళలను అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేక పోతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. పోలీసుల మీద రాళ్లు విసిరితే మాకు బీపీలు రావా? డైవర్షన్ పాలిటిక్స్ కు జగన్ పేటెంట్ తీసుకున్నారు' అని అన్నారు.