AP: పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో టీడీపీ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. రూ.14 కోట్లతో చేపట్టిన దమయ్యపర్తి డ్రైన్ కాంక్రీట్ గోడకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో డ్రైన్ పనులు విధ్వంసానికి గురయ్యాయి అని తెలిపారు. డ్రైన్ పనులు పూర్తి చేసి పాలకొల్లును ముంపు నుంచి కాపాడుతాం. నిధులు దారి మళ్లించి పురపాలికలను జగన్ నిర్వీర్యం చేశారని నిమ్మల పేర్కొన్నారు.