AP మాజీ CM జగన్ రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అపఖ్యాతిలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జగన్‌ను చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని తెలిపారు. వచ్చేసారి జగన్ రాడు అనే భరోసా కల్పిస్తేనే పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఏపీలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.