ఏపీ మాజీ సీఎం జగన్ ఇటీవల లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ఇకపై తన రాజకీయ కార్యకలాపాలన్నీ బెంగళూరు కేంద్రంగా చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉగాది నుంచి జిల్లాల పర్యటన, ఇతర పార్టీ నేతలను వైసీపీలోకి ఆహ్వానించడం లాంటి కీలక ఘట్టాలు అన్ని జగన్ బెంగళూరు కేంద్రంగానే ప్రణాళికలు చేస్తున్నట్లు తెలుస్తోంది.