జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే: హోంమంత్రి అనిత

81చూసినవారు
జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే: హోంమంత్రి అనిత
AP: పొదిలిలో పోలీసులు తిరిగి ఎదురు రాళ్లదాడి చేసి ఉంటే వైఎస్ జగన్ చుట్టూ ఎంతమంది మిగిలేవారో గుర్తుపెట్టుకోవాలని హోంమంత్రి అనిత హెచ్చరించారు. కేజీ పొగాకు ధర కూడా తెలియకుండా పొగాకు రైతులు పరామర్శకు జగన్ వెళ్లారని విమర్శించారు. జగన్ పులివెందులకు మాత్రమే పరిమితమైన ఎమ్మెల్యే అని గుర్తుపెట్టుకోవాలని అనిత ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ విపక్ష పార్టీ కడుపు మంట చూస్తే నవ్వొస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్