AP: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జగన్ కు బిగ్ షాక్ తగిలింది. రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ తన సొంత మీడియాలో చేస్తోన్న విష ప్రచారాన్ని నిరసిస్తూ నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలుగు మహిళా విభాగం జిల్లాశాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి లక్ష్మీటాకీస్ వరకు వందలాది మంది మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం లక్ష్మీటాకీస్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.