అమరావతిని దెబ్బతీసేందుకే జగన్ కుట్ర: బీజేపీ ఎమ్మెల్యే

59చూసినవారు
అమరావతిని దెబ్బతీసేందుకే జగన్ కుట్ర: బీజేపీ ఎమ్మెల్యే
AP: అమరావతి మహిళలపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అన్నారు. బుధవారం కడపలో ఆయన మాట్లాడుతూ.. కుట్రపూరితంగానే చిచ్చు పెట్టి అమరావతిని దెబ్బతీసేందుకు జగన్ కంకణం కట్టుకున్నారని మండిపట్టారు. కుట్రలో భాగంగానే కొమ్మినేని, కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు జైలులో ఊచలు లెక్కపెడతారని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్