వైసీపీ ఈనెల 5న నిర్వహించ తలపెట్టిన ఫీజు పోరు భారీ నిరసన కార్యక్రమానికి ఆదిలోనే దెబ్బ పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేథ్యంలో ఈ కార్యక్రమాన్ని వైసీపీ ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే లండన్ నుంచి ఇటీవల వచ్చిన జగన్ ఈ గ్యాప్‌లో ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫీజు పోరుకు కాస్త సమయం ఉండటంతో ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఇబ్బందులకు గురవుతున్న విద్యార్థులను కలిసే యోచనలో వైసీపీ బాస్ ఉన్నట్లు తెలుస్తోంది.