విజయవాడలో వరద పెను విషాదం మిగిల్చింది.ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.వరదలతో విజయవాడ అతలాకుతలం అయింది. బాధితులకు అండగా నిలిచేందుకు జగన్ పార్టీ నేతలతో సమీక్ష చేసారు. పార్టీ నుంచి కోటీ రూపాయాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో పార్టీ నుంచి నేతలతో టీంలు ఏర్పాటు చేసారు. అందులో భాగంగా బుధవారం ఉదయం లక్ష పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేస్తామని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు.