ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత నేతల వలసల నేపథ్యంలో అధినేత జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ కు సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్ ను నియమించారు. అలాగే పెనమలూరుకు చెందిన వేణుగోపాల్ కృష్ణమూర్తిని రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. వైసీపీ హయాంలో అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన పొన్నవోలు సుధాకర్ రెడ్డిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే వైసీపీలో 41 అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని కూడా నియమిస్తూ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు.