హైకోర్టులో జగన్ పిటిషన్‌.. మార్చి 6కు విచారణ వాయిదా

59చూసినవారు
హైకోర్టులో జగన్ పిటిషన్‌.. మార్చి 6కు విచారణ వాయిదా
AP: వైసీపీ అధినేత జగన్‌పై విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో మంత్రి నారాయణ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టును జగన్ ఆశ్రయించారు. తనపై నమోదైన ఈ కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ విచారణ జరపాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. దీంతో కౌంటర్ దాఖలుకు మంత్రి నారాయణ తరపున లాయర్ సమయం కోరారు. ఈ మేరకు తదుపరి విచారణను ధర్మాసనం మార్చి 6కు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్