AP: పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ముగ్గురు వైసీపీ నేతలు నేడు విచారణకు హాజరయ్యారు. సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, వైసీపీ నాయకుడు గజ్జల సుధీర్‌భార్గవ్ రెడ్డి వచ్చారు. పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, ప్రజాసమావేశాల విషయంలో నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం.