దళితులకు అండగా జగన్: నందిగం సురేశ్

46చూసినవారు
దళితులకు అండగా జగన్: నందిగం సురేశ్
AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ.. ‘బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు జగన్ కృషి చేశారు. దళితులకు అండగా నిలబడ్డ నేత జగన్. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో వైైసీపీ పాలన సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్