భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తొలిసారిగా ఆఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో ఫోన్‌లో చర్చలు జరిపారు. వారు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించగా.. జైశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని ఆయన తన Xలో పోస్ట్ చేశారు. కాగా తాలిబన్‌తో కేంద్రమంత్రిత్వ శాఖ చర్చలు జరపడం చరిత్రలో ఇదే తొలిసారి.