భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో యువ సంచలన బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. హర్షిత్ రాణా వేసిన 9వ ఓవర్ 3వ బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. బంతి నేరుగా గాల్లోకి లేచింది. అయితే, యశస్వి జైస్వాల్ వెనక్కు పరిగెడుతూ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.