US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ వచ్చేవారం భారత్‌కు రానున్నారు. ఇరు దేశాలు సంయుక్తంగా ప్రారంభించిన క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ (iCET) ప్రగతిని ఆయన పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. AI, సెమీ కండక్టర్స్, బయోటెక్నాలజీ, రక్షణ ఆవిష్కరణల రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఐసెట్‌ను భారత్, అమెరికా ప్రారంభించాయి. కాగా, భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో సలివాన్ కీలక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.